పెద్దవారి చేయి ఎల్లప్పుడూ పైనే ఉండే విధంగా చూసుకోండి
"ఈ పూట నాకేం పనిలేదు. ఏదైనా కథ చెప్తారా" అన్నాడు మనోడు.
"కథ కాదు గానీ నిజంగా జరిగిన చిన్న సంఘటన చెప్తా విను"
"చెప్పండి సార్ " అంటూ టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. నేను ఏం చెప్పినా రికార్డు చేసుకోవడం మనోడికి అలవాటు.
"మొన్నామధ్య మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను... నేను వెళ్ళేసరికి మా ఫ్రెండ్ దంపతులు చాలా హడావుడిగా వున్నారు."
"ఏంటి ఏదో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఏంటి విశేషం" అడిగాను.
"మా అమ్మాయి సుధ తెల్సుగా సుధ. దానికి మంచి ఉద్యోగం వచ్చింది. ఇవాళ అది మొదటి నెల జీతం అందుకునే రోజు.
అందుకని.. దిష్టి తీయడం.. స్వీట్ తినిపించడం.. "అంటూ చాలా ఉద్వేగంగా, ఉత్సాహంగా చెప్తుండగానే సుధ వచ్చింది. వరండాలో చీకట్లో వున్న మేము సుధకి కనిపించము. లోపలికి వెళ్ళిపోయింది.
సుధ లోపలికి వెళ్ళగానే నా స్నేహితుడి ముఖంలోకి చూశాను. వెలిగి పోతోంది.
క్షణం తర్వాత లోపల్నించి మాటలు వినబడుతున్నాయి.
" తొలి జీతం కదా. నాన్న గారికి ఇవ్వమ్మా".
"ఇవ్వను" తెగేసి చెప్పినట్టు సుధ గొంతు వినబడింది.
అప్రయత్నంగా మా ఫ్రెండ్ ముఖం వంక చూశాను. ఫ్యూజ్ పోయిన బల్బ్ లా మాడిపోయి వుంది. నేను అక్కడ వుండడం సబబు కాదనిపించి లేవబోయాను. నా చెయ్యి పట్టుకుని కూర్చోమన్నట్టు లాగాడు. వాడి చెయ్యి సన్నగా వణుకుతోంది.
" తప్పే.. అలా అనకూడదు.. నీ సంతోషం చూడాలని నువ్వు
ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నారు నాన్నగారు.వెళ్ళు.. వెళ్ళి జీతం ఇచ్చిరా పో"
"ఏంటమ్మా.. ఒకసారి చెప్తే అర్ధం కాదా.. నేను ఇవ్వను.
ఆ టేబుల్ మీద పెడతా.. వచ్చి తీసుకోమను."
ఈ సంభాషణ వింటున్న మా వాడు తలొంచుకుని కూర్చున్నాడు. కళ్ళల్లో నీళ్ళు నిలిచాయేమో చీకట్లో నాకు కనబడలేదు. చెంప ఛెళ్ళుమన్న శబ్దం.
"అమ్మా"
"ఛీ..ప్రేమ లేదు కనీసం విశ్వాసం కూడా లేదే నీకు" ఏడుపు దాచుకో లేకపోతోంది తల్లి.
" అమ్మా.. ఎంతసేపూ.. నీ వైపునుండి ఆలోచించడమేనా.. నేనెందుకు ఇవ్వనంటున్నానో అడగవా…"
"చెప్పేడు .."
"అమ్మా.. చిన్నప్పట్నించీ నాన్న నన్ను ఎంతో గారాబంగా పెంచాడు.. చిన్నప్పటి ఐస్ క్రీమ్ దగ్గర్నించి ఇవాళ పొద్దున్న
ఆఫీస్ కి వెళ్ళడానికి ఆటో ఖర్చుల దాకా అన్నీ నాన్నే ఇచ్చేవాడు. అలా ఇచ్చిన ప్రతిసారీ నాన్న చేయి పైన నా చేయి కిందా వుండేది. అలాంటిది ఇప్పుడు తగుదునమ్మా అని జీతం నాన్నకిస్తే నాన్న చేయి కిందా నా చేయి పైనా వుంటుందమ్మా.. అది నాకిష్టం లేదు. నాన్న చేయి ఎప్పుడూ పైనే వుండాలమ్మా. అందుకే ఇవ్వనంటున్నానమ్మా" అంటూ భోరుమని ఏడ్చింది సుధ.
అది విన్న మా ఫ్రెండ్ భావోద్వేగంతో " అమ్మా సుధా.. నా తల్లీ " అని పెద్దగా ఏడుస్తూ లోపలికి పరిగెత్తాడు.
అని చెప్పి మనోడి వంక చూశాను. కళ్ళనిండా నీళ్ళు. తుడుచుకోవడంతో కూడా మరిచి పోయి చూస్తున్నాడు.
"దీని వల్ల నీకేం అర్ధం అయింది. మనకన్నా వయసులో పెద్ద వారికి మన చేయి పైన వుండేలా ఇవ్వకూడదు. దోసిలిలో పట్టుకుని వారిని తీసుకోమనాలి. అంతేకాదు దేవుడికి పువ్వులు, పత్రి లాంటివి వేసేటప్పుడు మనం ఇస్తున్నట్లు కాకుండా అరచేతిలో పెట్టుకుని సమర్పించాలి. అది మన సంస్కృతి. మన సంప్రదాయం. "
జై శ్రీమన్నారాయణ !!
#telugu language

ఈరోజు మంచిమాట. *చిరిగిన పంచి చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన 15-16 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్‌కు వచ్చాడు.* *ఇద్దరూ కుర్చీలపై కూర్చోవడం చూసి, ఒక వెయిటర్ రెండు గ్లాసుల చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు - మీ కోసం ఏమి తీసుకు రావాలి?*
*ఆ వ్యక్తి ఇలా అన్నాడు- " జిల్లాలో పదవ తరగతిలో మొదటి స్థానంలో వస్తే, నగరంలోని అతి పెద్ద హోటల్‌లో దోశ తినిపిస్తాను అని మా అమ్మాయికి వాగ్దానం చేశాను."*
మా అమ్మాయి వాగ్దానాన్ని *నెరవేర్చింది. దయచేసి తన కోసం ఒక దోశ తీసుకు రండి. "వెయిటర్ అడిగాడు-" మీ కోసం ఏమి తీసుకు రావాలి? "అతను అన్నాడు-" నా దగ్గర ఒక దోశకు సరిపడే డబ్బే ఉంది. నాకు వొద్దు ..."మొత్తం విషయం విన్న తర్వాత వెయిటర్ యజమాని వద్దకు వెళ్లి మొత్తం కథ చెప్పాడు- "నేను వీళ్ళ ఇద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటు న్నాను . ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసివేయవచ్చు." అప్పుడు యజమాని అన్నాడు- "ఈ రోజు మనం హోటల్ తరపున తను ఫస్ట్ వచ్చినందుకు వాళ్లకి పార్టీ ఇద్దాం అన్నాడు ... ఇది విని వెయిటర్ చాలా ఆనంద పడ్డాడు.*
హోటల్ వాళ్ళు ఒక టేబుల్‌ను చక్కగా అలంకరించారు... ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో పేద అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు...అ యజ మాని వాళ్లకి మూడు దోశలుతో పాటు పొరుగు వారికి స్వీట్స్ పంచమని పెద్ద సంచిలో ప్యాక్ చేశాడు... చాలా గౌరవం ఇచ్చిన అతను, అతని కుమార్తె కళ్ళలో ఆనందంతో కన్నీళ్లతో తన ఇంటికి వెళ్ళారు...
సమయం గడిచి పోయింది ...
ఒక రోజు ఆ అమ్మాయే I.A.S. పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ నగరానికే కలెక్టర్‌గా వచ్చింది. ఆమె ముందు ఒక అటెండర్ ని అదే హోటల్‌కు పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవ డానికి వస్తానని చెప్పారని తెలియ జేయమంది ... హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్‌ను బాగా అలంక రించాడు. ఈ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండి పోయింది...
అదే అమ్మాయి కలెక్టర్ అయి తన తల్లి దండ్రులతో నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది. అందరూ ఆమె గౌరవార్థం నిలబడ్డారు. హోటల్ యజమాని ఆమెకు ఒక పూల గుత్తిని సమర్పించి ఆర్డర్ కోసం అభ్యర్థించారు. ముందుకు వెళుతున్నప్పుడు, ఆమె ఇలా చెప్పింది- "మీరిద్దరూ నన్ను గుర్తించలేక పోవచ్చు. , ఎవరి తండ్రికి మరొక దోశ తినటానికి డబ్బు లేదో నేను ఆ అమ్మాయినే. అప్పుడు మీరిద్దరూ మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు, నేను పాస్ అయి నందుకు ఒక అద్భుత మైన పార్టీని ఇచ్చి మాకే కాకుండా మా పొరుగు వారికి కూడా ఇవ్వమని స్వీట్లు ప్యాక్ చేశారు..
ఈ రోజు నేను మీ ఇద్దరి మంచి తనంతో కలెక్టర్ అయ్యాను..... మీ ఇద్దరినీ నేను ఎప్పుడూ అనుకూలంగా గుర్తుంచు కుంటాను... ఈ రోజు ఈ పార్టీ నా తరపున ... ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేను కడతాను.... అలా అని అందరి ముందు వాళ్ళని సత్కరించింది తను..
*నింగిలోని చందమామ కు నీటిలోని కలువ భామ కు* ఏనాటి సంబంధం తెలియదు గానీ ఆ మామ ను చూడగానే ఈ భామ ఫక్కున నవ్వుతుంది.
ఆ నవ్వుల పువ్వులతో కొలను
అంతా వెలిగిపోతుంది. అలాగే *కారం దోశ కు కలెక్టర్ గారికి* ఉన్న అనుబంధంతో
ఒక్కసారిగా అక్కడి వాతావరణం ప్రకాశం తో నిండిపోయింది.
ఆ *భోజన శాల తో ఈ బ్రహ్మపుత్రకి*(సరస్వతి పుత్రిక) వున్న బంధం గురించి నలుగురికీ తెలిసింది భోజనశాల వైభోగం
పదింతలంయ్యింది.
*అందుకే అంటారు చేసిన పుణ్యం, నాటిన మొక్క ఊరికే పోదు అని.*
ముళ్ళ పొదల మధ్య బంధిగా
ఉన్న మల్లెపువ్వు తన పరిమళం గుణంతో అందరి చేత మెప్పు పొంది. ఆ ముళ్ళ
పోదలనే రక్షణ కవచాలుగా మార్చుకున్నట్లు.
ఈ సరస్వతీ పుత్రిక కూడా పేదరికంలో ఉండి, తన చదువు సంధ్యలతో, సంస్కార గుణంతో, పేదరికాన్ని జయించడమే కాక ప్రజల అందరి మన్నన పొందగలిగింది.
అందుకే అంటారు *కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు* అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ నిరుపేద పుత్రిక.
అందుకే *మనుషులను మనీతో కాకుండా మనసుతో చూడాలి* అప్పుడే మన విలువ మరింత పెరుగుతుంది.
రత్నం కూడా ఒక రాయి దానిని
దాని గుర్తించి వేరు చేయగలిగితే దాని విలువ
లెక్కకు మించి ఉంటుంది అని నిరూపించబడుతుంది.
*మనల్ని మనం గౌరవించు కుందాం మన చుట్టూ ఉన్న వాళ్ళని మరింత గౌరవంగా చూద్దాం*
*సర్వేజనా సుఖినోభవంతు.*
....సేకరణ ....
#Telugu

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Miracle of Prayer
#telugu language
#telugu language
Goodmorning to all
ఒకాయన రాత్రి పడుకునే ముందు తన రీడింగ్ టేబుల్ తల పెట్టి అలా కూర్చుని నిద్ర పోతున్నాడు. అప్పుడు అతని భార్య అతన్ని లేపి మంచం మీద పడుకోమని చెప్పాలని వచ్చింది. అప్పుడు ఆమె దృష్టి అతని చేతిలో పెన్ను పై అతని ముందు రైటింగ్ పాడ్ పై పడింది. దానిమీద ఏదో రాసి ఉంది. ఆమె తన భర్తను కదిలించకుండా ఆయన రాసినదాన్ని చడావసాగింది.. నిశ్శబ్దంగా!
"గత ఏడాది నాకు సర్జరీ జరిగి గాల్ బ్లాడర్ తొలగించారు. మూడు నెలలు మంచం మీదే గడపాల్సి వచ్చింది...
"ఈ ఏడాదే నాకు 60 ఏళ్లు నిండి నాకెంతో ప్రియమైన ఉద్యోగం రిటైర్ అయ్యాను. నేను ముప్ఫై ఏళ్లు ఈ కంపెనీలో రాత్రనక పగలనక కష్టపడి పని చేసి కంపెనీ అభివృద్ధి లో పాలు పంచుకున్నాను. ఆ కంపెనీ తో నాకెంతో అనుబంధం ఉంది.
"ఈ ఏడాదే మా నాన్నగారి మరణం నా జీవితంలో విషాదం నింపింది.
"ఈ ఏడాదే నా కొడుకు కారు ప్రమాదం వల్ల మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. ఎన్నాళ్లుగానో నాకు సేవ చేసిన నా ప్రియమైన కారు ఎందుకూ పనికిరాకుండా పోయింది.
"దేవుడా! ఈ ఏడాదిలో ఎన్ని భయంకరమైన అనుభవాలు ఇచ్చావు!!"
చివరి వరకూ చదివిన ఆమె నిశ్శబ్దంగా ఆ రైటింగ్ పాడ్ ను తీసుకుని బయటకు నడిచింది.
కాసేపటి తర్వాత ఆమె వచ్చి పాడ్ ను అక్కడే పెట్టి వెళ్ళిపోయింది.
ఆయనకి మెలుకువ వచ్చింది. తన చేతిలో పెన్ను, టేబుల్ మీద రైటింగ్ పాడ్ చూసుకున్నాడు. దానిమీద రాసి ఉన్నది చదివాడు.
"గత ఏడాది నాకు గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది. చాలా కాలంగా నన్ను వేధించిన కడుపు నొప్పి కి ఎట్టకేలకు ముగింపు పలక గలిగాను.
"ఈ ఏడాది లోనే నాకు అరవై ఏళ్లు నిండాయి. సంపూర్ణ ఆరోగ్యం తో నేను రిటైర్ అయినందుకు ఆనందంగా ఉంది. ఇక నా పూర్తి సమయాన్ని ప్రశాంతంగా నా ఆనందం కోసం, నా కుటుంబం కోసం గడుపుతాను.
"ఈ ఏడాదిలోనే మా నాన్నగారు 95 ఏళ్ళ వయసులో ఎవరితోనూ చేయించుకోకుండానే ఎలాంటి ఇబ్బందీ లేకుండానే ప్రశాంతంగా శివైక్యం పొందారు.
"ఈ ఏడాదిలోనే దేవుడు నా కొడుకుకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. కారు పోతే పోయింది గానీ నా కొడుకు ఎలాంటి సమస్యా లేకుండా పెద్ద గండం నుండి బయట పడ్డాడు.
"దేవుడా! ఈ ఏడాది ఎంత సంతోషాన్ని మిగిల్చావు!! ఈ ఏడాదిని ఎంత అద్భుతంగా ముగించావు!!!"
అంతా చదివిన ఆయన చుట్టూ ఓసారి చూసాడు. కర్టెన్ వెనకాల తన భార్య నీడను గమనించి జరిగింది అర్థం చేసుకున్నాడు. తన భార్యను మనసులోనే అభినందించుకున్నాడు....
ఎంతో ప్రోత్సాహ భరితంగా ఉన్న ఆ వాక్యాలు చదివిన ఆయన భగవంతునికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటు సంతృప్తిగా నిట్టూర్చాడు.
☀️☀️☀️
మన ఆలోచనా సరళి సరిగా ఉంటే మనం చేసే పని సరైన దారిలో నడుస్తుంది. ఫలితం అనుకూలంగా ఉంటుంది.
ఫలితం అనుకూలంగా ఉంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది.
అదే కదా ఆనందమయమైన జీవితం!!!
🕊️🍒🪔
#telugu

*వృద్ధులెందుకు?*
❓❓❓❓❓❓❓
టీ కప్పు హాండిల్ విరిగింది. దానిని ఏ బడ్స్ దాయటానికో, పిన్నీసులు పెట్టుకోవడానికో ఉపయోగిస్తున్నాము!
దుప్పటి చిరిగిపోయింది. దానిని నాలుగుమడతలు వేసి కాళ్ళు తుడుచుకునే పట్టా క్రింద వాడుతున్నాం!
కుండ చిల్లిపడింది! దానిని పూలకుండీక్రింద వాడుతున్నాం!
మరి సంపాదించే శక్తి ఉడిగిపోయిందంటూ వృద్ధులను వృద్ధాశ్రమాలలో ఎందుకు పెడుతున్నాం?
కండరాల శక్తి వలననే ఉపయోగమా?
వారి అనుభవాన్ని, జ్ఞానాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం?
పైగా, వృద్ధాశ్రమాలలో పండ్లు పంచిపెట్టడం చేసి వారి మీద సానుభూతి చూపి, ఏదో దైవకార్యం చేసినట్లు ఫోజులిస్తున్నాం!
మన దేశంలో వృద్ధులపట్ల ఒక ఉదాసీన భావం బాగా ప్రబలిపోయింది!
అమెరికా అధ్యక్షపదవికి పోటీ పడిన ఇద్దరు అభ్యర్థుల వయస్సు చూస్తే 79 ఒకాయనకు, 75 ఒకాయనకు!
వారు ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించగలిగే కీలకపదవికి పోటీదారులు!
నోబెల్ ప్రైజు గెలుచుకున్న వారి వయస్సు ఒకసారి అందరిదీ పరిశీలించండి. అందరూ వృద్ధులే దాదాపుగా!
మనకు అర్ధం కావడంలేదు మనదేశంలో ఏం పోగొట్టుకుంటున్నామో!
*ఒక వృద్ధులైన డాక్టర్ వద్దకు వెళ్ళు ఏం లాభమో తెలుస్తుంది.*
*ఒక వృద్ధులు అనుభవజ్ఞుడైన లాయర్ వద్దకు వెళ్ళు. ఎంతో విజ్ఞతతో కూడిన సలహా లభిస్తుంది.*
*ఒక వృద్ధులైన కళాకారుడిని అడిగిచూడు మెలకువలు తెలుస్తాయి!*
అసలు ఏ రంగంలో వృద్ధులు ఆ రంగంలో ఒక నిధి!
వారిని సేవించండి జ్ఞానం లభిస్తుంది!!
వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటే, వారు ఎంతో ఉత్సాహంగా ఉపయోగపడతారు. పైగా వారి ఆరోగ్యమూ మెరుగుపడుతుంది!
అసలు వారే దేశ సంపద! వారి అనుభవం, విజ్ఞత; దేశానికి, సమాజానికి, కుటుంబాలకు ఉపయోగపడవద్దా?
*అసలు వృద్ధులెందుకు?*
ఆలోచించoడి

పిల్లాడికి 5 ఏట వచ్చేదాక నెత్తిన పెట్టుకొని పెంచండి
15వ ఏట వచ్చేదాక క్రమశిక్షణతో పెంచండి
25వ ఏట వచ్చేదాక మంచి స్నేహితుడిలా పెంచండి
మీ పెంపకం నుండే వాడికి సంస్కారం అలవాటు అవుతుంది అని గుర్తించండి.
అమ్మమ్మలు ,నాయినమ్మలతో కొన్నాళ్ళు గడిపే అవకాశం వారికివ్వండి.బంధువులు బాంధవ్యాల గొప్పతనం తెలిసోకోనివ్వండి. ముఖ్యంగా ఆడవాళ్లు అత్తమామలను ఇంటికి రానియ్యటంలేదు. రేపు మీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటే…? చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. మీరు మారండి పిల్లలకు మారే అవకాశం ఇవ్వండి.
అసలేం జరుగుతుంది మన దేశంలో..?
విద్యాసంస్ధలేమో లాబాల కోసం
ఉపాధ్యాయులేమో జీతాల కోసం
తల్లిదండ్రులేమో ఎంత ఖర్చైనా పర్లేదు
తమ పిల్లలకు మంచి ర్యాంకులు రావాలి
పిల్లలకేమో బట్టి కొట్టైన కాపి పెట్టైనా
ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని.
బయట ఎండ నాన్నా అని చెప్పి వాడి చేతిలో Mobile పెడతారు ఇక వాడి ఆటలన్ని అందులోనే..
అది కాస్తా తలుపులు వేసుకొని
బూతు బొమ్మలు చూసేదాకా వెళ్తాయి.
మీ అందరి స్వార్ధంతో అజ్ఞానంతో పిల్లల ఇష్టాలను, ఎదుగుదలను బాల్యంలోనే సమాధిచేస్తున్నారు.
గుర్తుంచుకోండి..
”మీరు పెంచేది మీ పిల్లల్ని కాదు
సమాజాన్ని తీర్చిదిద్దే
రేపటి తరాన్ని. .”
అది మర్చి పోవద్దు…
వారే రాబోయే రోజుల్లో ఈ జాతి నిర్మాణ రథ సారథులు .
ఇప్పుడు వారుంటున్న వసతి గృహాలు రేపు మీ వృద్ధాశ్రమాలు..

Truely Inspiring.. use google translate to Read..
#telugu Language
మచిలీపట్నం దగ్గరలోని సీతారామపురంపల్లెలో ఒక రైతుకుటుంబంలో 1992 జూలై 7 వ తేదీన Srikanth_Bolla పుట్టినపుడు తల్లితండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధ పడ్డారు. ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి. ఆ వూరిజనం అయితే మరో అడుగు ముందుకేసి, ఆ పిల్లవాడిని ఎలా వదిలించుకోవాలో కూడా సలహాలు ఇచ్చారు. కానీ అమ్మ నాన్న అలా చేయలేదు. ”మేము బతికున్నంతవరకు వీడిని బాగా చూసుకొంటాం. మేము పోయాక దేవుడే చూసుకోవాలి” అని అనేవారు. కళ్ళుకనపడకపోవడం తప్ప , బడిలో శ్రీకాంత్ అందరికంటే చురుకుగా వుండేవాడు. కానీ ఇంటర్ లో నీవు గుడ్డివాడివి కాబట్టి సీటు ఇవ్వలేమని కాలేజీలు చెపితే శ్రీకాంత్ కోర్టుకెళ్ళి గెలిచి admission తెచ్చుకొన్నాడు. తోటి పిల్లల ఎగతాళి భరించలేక చదువు మానేసి 2 ఏళ్ళు ఇంట్లోనే వుండిపోయాడు. మళ్ళీ హైదరాబాద్ లో school for the specially abled లో చేరాడు. అక్కడకూడా పిల్లలు అవమానపెట్టారు. అందరూ తనను వదిలేసి వెళ్ళిపోతుంటే బాధ తట్టుకోలేక బడివదిలేసి పారిపోతుంటే ఒక teacher పట్టుకొని చెంపచెళ్ళుమనిపించింది. అది అతని జీవితం లో game changing moment. ఆ టీచర్ ఆడియో టేపుల్లో పాఠాలు వినిపించింది. ఇంటర్ లో MPC చదివి 98% సంపాదించగా ఎగతాళి చేసినవారు అవాక్కయ్యారు. కానీ IIT వాళ్ళు సీటు ఇవ్వమన్నారు. నిరాశ పడని అతను అమెరికా universities లకు entrance exams వ్రాస్తే Stanford, మరో 2 universities admission ఇవ్వడానికి ముందుకొచ్చాయి. శ్రీకాంత్ Howard Massachusetts Institute of Technology [ అమెరికా ] లో చేరాడు. అక్కడ Brain Cognitive Sciences లో చేరిన తొలి అంధుడిగా రికార్డు పొందాడు.
అతని ప్రతిభ చూసి , చదువు అయ్యాక 4 అమెరికన్ కంపెనీ లు తమదగ్గర వుద్యోగం చేయమని అడిగితే శ్రీకాంత్ సున్నితంగా ‘ లేదు ‘ అనిచెప్పాడు. ‘ భారతదేశం చేరుకొని తనతోటి నిరుపేద , దివ్యాంగ భారతీయులకు సహాయపడే భాగ్యాన్ని నాకు ఇవ్వు ‘ అని అతను భగవంతుడిని ప్రతి రాత్రీ ప్రార్థించేవాడు. ప్రార్థనలు పరమాత్మ విన్నాడు.
శ్రీకాంత్ India కు వచ్చి హైదరాబాద్ దగ్గర Bollant Industries స్థాపించాలని వుందంటే రతన్ టాటా ముందుకొచ్చి ఫండ్స్ ఇచ్చారు. అది మొదలైంది. ఈరోజు అది 150 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీ. దానికి శ్రీకాంత్ CEO. సాక్షాత్తూ అబ్దుల్ కలాం గారే అక్కడికొచ్చారు. ఇద్దరూ కలిసి Lead India Project ద్వారా 4 లక్షలమంది విద్యార్థులకు పాఠాలు చెప్పారు. శ్రీకాంత్ దగ్గర ఇపుడు సుమారు 300 మంది దివ్యాంగులు వుద్యోగాలు చేస్తున్నారు. అతను 3000 మంది విద్యార్థులను చదివిస్తున్నాడు.
#చీకటి ని అసహ్యించుకోనేవారు కొందరు , చీకటి ని చూసి భయపడేవారు ఇంకొందరు ,చీకటిని చీల్చుకువెళ్ళేవారు మరికొందరు.ఆ మూడవరకం వాళ్ళను మూడక్షరాల పదం లో ” సూర్యుళ్ళు ” అంటారు. మనవాడు మరోసూర్యుడు,మరియు ఎందరికో మార్గదర్శి,ఇటువంటి వారి చరిత్రలు ఎందరికో దశ,దిశ నిర్దేశితాలు....👏👏👏

అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఓసారి కూనూరు (ఊటీ) వెళ్లాడు... అక్కడికి వెళ్లాక తెలిసింది, ఫీల్డ్ మార్షల్ శాంమానిక్ షా అక్కడే ఓ మిలిటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడని..! 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో తను మన ఆర్మీ చీఫ్... తనను పరామర్శించాలని అప్పటికప్పుడు నిర్ణయించుకుని నేరుగా వెళ్లాడు... మానిక్ షా బెడ్ పక్కనే చాలాసేపు కూర్చుని ఆరోగ్యస్థితిని కనుక్కున్నాడు.., వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించాడు...
తిరిగి వెళ్లిపోయే సమయంలో... ‘‘ఇక్కడంతా సౌకర్యంగానే ఉందా..? నేను చేయదగిన సాయం ఏమైనా ఉందా..? అడుగు మిత్రమా..?’’ అన్నాడు కలాం...
‘‘ఓ అసంతృప్తి ఉంది సార్...’’ అన్నాడు మానిక్ షా...
'‘ఏమిటది..?’’ కలాం మొహంలో ఆశ్చర్యం...
‘‘నా దేశ ప్రథమ పౌరుడే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను లేచి తనకు శెల్యూట్ చేయలేని స్థితిలో ఉన్నందుకు అసంతృప్తి సార్...’’ అన్నాడు కళ్లు తుడుచుకుంటూ...
కలాం కళ్లల్లో కూడా తడి... షా చేయి మీద చేయి వేసి ఆత్మీయంగా నొక్కాడు...
‘‘సార్, చిన్న రిక్వెస్టు... ఇరవై ఏళ్లుగా నాకు ఫీల్డ్ మార్షల్ ర్యాంకుకు దగిన పెన్షన్ రావడం లేదు...’’ చెప్పాడు షా...
కలాం ఢిల్లీ వెళ్లగానే చేసిన మొదటిపని... షా పెన్షన్ ఫైల్ తెప్పించుకోవడం..! తగిన ఆదేశాలు జారీచేయడం...! వారం రోజుల్లో డిఫెన్స్ సెక్రెటరీ ద్వారా 1.25 కోట్ల బకాయిలకు సరిపడా చెక్కును ప్రత్యేక కొరియర్ ద్వారా ఊటీకి పంపించారు...
దటీజ్ కలాం... ఇక్కడే చిన్న ట్విస్టు... ఆ డబ్బు మొత్తాన్ని మానిక్ షా ఆర్మీ రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేశాడు... దటీజ్ షా... వావ్... ఎవరు ఎవరికి శెల్యూట్ చేయాలి..? ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు... జాతి శెల్యూట్ చేయదగిన కేరక్టర్లు...
దేశానికి , దేశ ప్రజలకు సేవ చేయడమంటె బందిపోట్లులాగా దోచుక తినటం కాదు...
రాజ్యాంగాన్ని , ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించి ,వాటిని పాటించి ,కాపాడటం...
రేపటి మన దేశపౌరులు వీరి నుండి ,ఇలాంటి వారి నుండి నే ర్చుకొవాలి.

#Inspiring
Dokka Seetamma
అర్థరాత్రి రెండుగంటల సమయంలో వర్షంలోతడిసిన వ్యక్తి "అమ్మా సీతమ్మ తల్లి .. ఆకలేస్తుందమ్మా" అని పిలవగానే ఎంతో ఆప్యాయంగా వంటచేసి అన్నం పెట్టి ,దుప్పటి ,వస్త్రాలు ఇవ్వగలిగిన ఔదార్యవతి డొక్కాసీతమ్మ తల్లి వర్ధంతి ఏప్రియల్ 28.
శ్రీ మతి డొక్కా సీతమ్మ గారు తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలుకా , మండపేట గ్రామంలో 1841, అక్టోబరు రెండోవారంలో జన్మించారు. ఈమె తండ్రి అనుపిండి భవానీశంకరం, తల్లి నరసమ్మ గార్లు. సీతమ్మ గారి తండ్రి శంకరం గారిని గ్రామస్తులు 'బువ్వన్న' గారనే పేరుతో పిలుస్తుండేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ 'బువ్వ'(అన్నం) పెట్టటమే!
అటువంటి తండ్రికి కూతురిగా జన్మించిన సీతమ్మ గారు అన్నార్తుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు. విద్యావాసనలు లేని లేని సాధారణ గృహిణి ఆమె.బాల్యంలో సీతమ్మ గారికి తల్లితండ్రులు కథలు, పాటలు, పద్యాలు అన్నింటినీ నేర్పారు. ఆ రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకునే అవకాశాలు సరిగా లేకపోవడంతో ప్రాచీన సంప్రదాయాలకు తలవంచి పెద్దబాలశిక్ష వంటి గ్రంధాన్ని కూడా పూర్తిగా అధ్యయనం చెయ్యకుండా నే పెళ్ళికి సిద్ధపడాల్సి వచ్చింది. సీతమ్మ గారి బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ గారు మరణిస్తే, ఇంటిని చక్కదిద్దే భారం సీతమ్మ గారి మీద పడింది. దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించింది.
గోదావరినదీ పరీవాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలను లంక గ్రామాలని అంటారు. అటువంటి ఒక లంక గ్రామం లంకగన్నవరం. ఆ గ్రామంలో డొక్కాజోగన్న పంతులు గారనే పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా. వీటన్నిటినీ మించి మంచి వేదపండితుడు. బువ్వన్నగారు సీతమ్మను డొక్కా జోగన్న గారికిచ్చి అతి వైభవంగా వివాహాన్ని జరిపించారు. సీతమ్మగారు అత్తవారింట్లో అడుగు పెట్టగానే ఆమె ఇంటి పేరు 'డొక్కా' గా మారింది. ఆమెలో సహజంగా ఉన్న ఉదారగుణం, దాతృత్వం రోజు రోజుకూ పెరగసాగాయి. జోగన్న, సీతమ్మ గార్ల దాంపత్యం అన్యోన్యమైనది. ఆ పుణ్య దంపతులను చూసి చుట్టుపక్కల గ్రామాల వారందరూ గొప్పగా చెప్పుకునే వారు. ఆప్యాయతా, ఆదరణలకు నిలయంగా వారి ఇంటిని గురించి ఆచుట్టుపక్కల గ్రామస్తులందరూ ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవారు.
లంక గ్రామాలకు చేరుకోవాలంటే, నేటికీ కూడా పడవే ముఖ్యమైన ప్రయాణ సాధనం. జోగన్నగారి గ్రామమైన లంకగన్నవరం త్రోవలో ఉండటంచేత, చాలామంది ప్రయాణీకులు వారి ఇంటనే భోజనాలు చేసేవారు. ఏ వేళ అతిధులు వచ్చినా వారికి అన్నపానాదులు లేవని చెప్పకుండా వారికి సకల మర్యాదాలు చెయ్యటం ఒక పవిత్రకార్యంగా ఆ దంపతులు స్వీకరించారు.
అచిరకాలంలోనే ఉభయ గోదావరి జిల్లాలలో 'అపర అన్నపూర్ణ' గా శ్రీమతి సీతమ్మ గారు పేరుపొందారు. లంక గ్రామాలకు తరచుగా వరదల వల్ల ప్రమాదాలు ఏర్పడేవి. నిలువ నీడలేని బాధితులను ఆదుకొని వారికి వసతి, భోజన సదుపాయాలను నిరాటంకంగా ఏర్పాటు చేసే ఉదాత్త గుణశీల సీతమ్మగారు. మగవాడు సంపాదించి ఎంత తెచ్చినా, ఔదార్యం లేని స్త్రీ ఉంటే ఆ సంపాదనకు అర్ధం, పరమార్ధం ఉండవు. అన్నదానం చేసి మానవతకు అర్ధం చెప్పిన మహిళాశిరోమణి సీతమ్మగారు. అలా అచిరకాలంలోనే ఆమె ఖ్యాతి భారతదేశమంతా వ్యాపించటమే కాకుండా, ఆంద్ర దేశపు కీర్తిని ఇంగ్లండు వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు సీతమ్మ గారు. అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే మాతృప్రేమ మరువరానిది.
ఆవిడజీవితమంతా మాతృప్రేమను పంచిన మహనీయురాలు గొప్ప నిరతాన్నదాత. వచ్చిన వాళ్లకి లేదనకుండా అన్నం పెట్టేవారు. ఆవిడ ధృతి, దీక్ష ఎంత గోప్పవంటే - ఆవిడ జీవితములో ఒకేఒక్కసారి అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికని బయలుదేరారు. బయలుదేరి, గోదావరి వంతెన వద్ద పల్లకి ఆపారు. ఆవిడ పల్లకిలో కూర్చునారు, బోయీలు అలసిపోయి గట్టు మీద కూర్చున్నారు. అటుగా పి.గన్నవరం వైపు వెళ్ళిపోతున్న ఒక బృందంలో పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే, పెద్దవాళ్ళు "ఒక్క అరగంట లో గన్నవరం వెళ్లీపోతాం... అక్కడ సీతమ్మ గారు మనకు అన్నం పెడతారు" అని మాట్లాడుకోవటం విన్నారు సీతమ్మగారు. వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్ళటం మానేసి, పల్లకి వెనక్కి తిప్పెయ్యండి... వీళ్ళకి అన్నం పెట్టాలి అని వెనుకకు వెళ్ళిపోయారు.ఇది ఆమె ఆమె ఔదార్యానికి ఓ మచ్చుతునక.
నిరంతర అన్నదానంతో
ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్లిపోయిందంటే, అందరికీ పెట్టి పెట్టి, ఆ దంపతులకి తినటానికి ఏమీ లేకుండా పోయింది.

🙏 ఈ వీడియో చేసిన మహానియునికి శత కోటి వందనాలు & మీ స్నేహితులకు పంపండి🙏
Translation: te-en
🙏 Hundred million thanks to the great man who made this video & send it to your friends 🙏
#Telugu Language
JOIN FOR MOST INSPIRING VIDEOS
👇👇👇👇👇👇👇👇
INSPIRING THOUGHTS
👆👆👆👆👆👆👆👆

ఎవరు రాశారో తెలియదు,
కానీ వాస్తవాలను అద్భుతంగా ఆవిష్కరించారు.
మనిషి ఇరుక్కున్నాడు... మెగా గ్లోబలైజేషన్ లో...
👉 డ్రమ్ముల మోతను సంగీతమంటున్నారు.!
👉 పీలికబట్టల్ని వస్త్ర ధారణ అంటున్నారు.!
👉 భౌతిక అకర్షణను ప్రేమని పిలుస్తున్నారు.!
👉 సహజీవనాన్ని సంసారమంటున్నారు.!
👉 గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నారు.!
👉 డూప్ ల పోరాటాన్ని హీరోయిజం అంటున్నారు.!
👉 పదవుల పోరాటాన్ని ప్రజాస్వామ్యమంటున్నారు..
👉 అధికార ఆరాటాన్ని రాజకీయమంటున్నారు.!
👉 ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు.!
👉 దారితప్పిన సరదాలను సంస్కృతి అంటున్నారు.!
👉 భుక్తి మార్గాన్ని చదువు అంటున్నారు.!
👉 కోరిన కోర్కెలు తీరిస్తేనే... దేవుడంటున్నారు.!
👉 ఆస్తి ఉంటేనే... గొప్పవాడు అంటున్నారు.!
👉 మందు పోయిస్తేనే...మిత్రుడు అంటున్నారు.!
👉 కట్నం తెస్తేనే...భార్య అంటున్నారు.!
👉 సొమ్ములు తెస్తేనే... సంసారం అంటున్నారు.!
👉 కాసులు తెస్తేనే... కాపురం అంటున్నారు.!
👉 నిజాయితీగా ఉంటే... అసమర్ధుడంటున్నారు.!
👉 సక్రమంగా ఉంటే... అమాయకుడంటున్నారు.!
👉 అసత్యాలు మాట్లాడితే... బ్రతక నేర్చిన వాడంటున్నారు.!
👉 నిజం పలికితే... నీ కెందుకు పోవోయ్ అంటున్నారు..!
👉 న్యాయబద్ధంగా ఉంటే... ఎలా బ్రతుకుతాడో అంటున్నారు.!
👉 అన్యాయంగా బ్రతికినా... సక్సెస్...ఎంచక్కా ఉన్నాడంటున్నారు.!
👉 అన్యాయాన్ని ఎదిరిస్తే... అతనికెందుకు అంటున్నారు.!
👉 నిజాయితీగా బ్రతికితే... కూడుపెడుతుందా అంటున్నారు.!
👉 మాయకమ్మిన జీవితాన్ని శాశ్వతమనుకుంటున్నారు.!
👉 మరణమనే మహా సత్యాన్ని విస్మరిస్తున్నారు.!
👉 పరిస్థితులకు అనుగుణంగా పాత అర్ధం చెరిగిపోయి, ప్రయోజనాలకు అండగా... సరికొత్త పరమార్ధం ఆవిర్భవిస్తోంది.!
🤔 స్వార్ధ కాంక్షాణుగుణంగా... విపరీతార్ధం ఆవిష్కృతమవుతోంది.!
ఇదే గ్లోబలైజేషన్ మహిమ అంటే
🔥 టెక్నాలజీ పెరిగింది...
🔥 సౌకర్యం పెరిగింది...
🔥 విలాసం పెరిగింది...
🔥 విజ్ఞానం పెరిగింది...
🔥 కాలుష్యం పెరుగింది...
🔥 ఖర్చు పెరిగింది...
🔥 కల్తీ పెరిగింది...
🔥 రసాయన బంధం పెరిగింది...
🔥 అన్నీ పెరిగాయి...
కానీ! పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు
మన ఆయుష్ ప్రమాణం మాత్రం 50% పైగా తగ్గింది..
రోగం తెలియని చికిత్సలు..శవాలకు రక్తపరీక్షలు...
విద్య పెద్ద వ్యాపారం...వ్యాధి ఇంకా పెద్ద వ్యాపారం
దహించనున్న గ్లోబల్ వార్నింగ్.... భావితరాలకు వార్నింగ్..
అయినా బాధ్యత లేనట్లు.. ఏమి తెలియనట్లు
నటించే మనిషికి శుభాకాంక్షలు ❤️.
సర్వే జనా సుఖినోభవంతు.🚩🙏🚩.
#TELUGU