మీ జాతక ఫలాలు ఖచ్చితంగా తెలుసుకోవాలంటే మీకు మీ రాశి ఏదో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అలాగే మీరు పుట్టిన లగ్నం కూడా తెలిసి ఉండాలి. మీ రాశి మీ లగ్నం మీరు ధరించవలసిన రత్నం అలాగే మీరు ధరించవలసిన టువంటి రుద్రాక్ష. మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా తెలుసుకోవాలంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి
https://imjo.in/AAhX9y
*🌻శుక్రవారం అమ్మవారికి ఎలా పూజ చెయ్యాలి?🌻*


🍃🌹శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ఆ ఇంట సిరి సంపదలు, అనుకున్న కోరికలు నెరవేరుతాయి.మరి అలాంటి శుక్రవారం రోజు పూజ ఎలా చేయాలి? ఏ రంగు దుస్తులు ధరించాలి? ఏ పూలతో పూజ చేయాలి అన్నది మనం ఇక్కడ తెలుసుకుందాం.

🍃🌹శుక్రవారం ఉదయం తలస్నానం చేసి పసుపు రంగు, ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి.

🍃🌹శుక్రవారం పూజా కార్యక్రమాలు పూర్తిగా ముగించుకొని అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి.అక్కడ నేతి దీపం వెలిగించడం ద్వారా దీర్ఘసుమంగళీగా ప్రాప్తం చేకూరుతుంది.శుక్రవారం రోజున మహిళలు నుదుటిన బొట్టు లేకుండా ఉండకూడదు

🍃🌹శుక్రవారం అమ్మవారికి తెలుపు రంగు పువ్వులు లేదా మల్లె పూలతో పూజ చేయడం చాలా మంచిది.చక్కెర పొంగలి నైవేద్యం అమ్మవారికి ఎంతో ఇష్టం

🍃🌹అందుకే నైవేద్యంగా చెక్కర పొంగలి పెడితే మంచి లాభాలు వస్తాయ్.అమ్మవారి ఆలయంలో కర్పూరం వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

🍃🌹ఆలయంలో దీపం వెలిగించడానికి ఇతరుల నుండి అగ్గిపెట్టెను తీసుకోకూడదు.అలా తీసుకోవడం ద్వారా మీరు చేసిన పూజ పుణ్యఫలం అంతా ఇతరులకు దక్కుతుంది.
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

తేదీ ... 16 - 09 - 2022,
వారం ... భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం,
వర్ష ఋతువు,
భాద్రపద మాసం,
బహళ పక్షం,

తిధి : షష్ఠి మ1.27 వరకు,
నక్షత్రం : కృత్తిక మ12.11 వరకు,
యోగం : హర్షణం ఉ8.42 వరకు,
కరణం : వణిజ మ1.27 వరకు,
తదుపరి భద్ర రా2.03 వరకు,

వర్జ్యం : తె5.23 నుండి,
దుర్ముహూర్తం : ఉ8.16 - 9.05 &
మ12.20 - 1.08,
అమృతకాలం : ఉ9.37 - 11.19,
రాహుకాలం : ఉ10.30 - 12.00,
యమగండం : మ3.00 - 4.30,
సూర్యరాశి : సింహం,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 5.51,
సూర్యాస్తమయం : 6.01,

*_నేటి మాట_*

*శుక్ర మౌఢ్యమి గూర్చి, కొంచెం వివరంగా తెలుసుకొందాము!!*
డిసెంబర్ 2 వరకూ - మూడం వుంటుంది అని మన జ్యోతిష్య పండితులు చెబుతున్నారు...
మన జ్యోతిష్య శాస్త్రం రెండు రకాల మౌఢ్యమిల గురించి చెబుతోంది...
ఒకటి శుక్ర మౌఢ్యమి ...
మరొకటి గురు మౌఢ్యమి...

సెప్టెంబర్ మాసం 15 వ తేదీనుండి డిసెంబర్ 2 వ తేదీ వరకు అనగా 79 రోజులపాటు శుక్ర మౌఢ్యమి ఉంటుంది...
మౌఢ్యమినే వాడుక భాషలో మూడం కూడా అంటారు...

నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి...
భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమిపై ఉన్నవారికి కనపడదు... దీన్నే అస్తంగత్వం లేదా మూడం అంటారు...
గ్రహాలకు రాజు సూర్యుడు, అంటే సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆగ్రహం తన శక్తిని కోల్పోతుంది, అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం, శుక్రడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం వస్తుంటాయి...
ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయని జ్యోిష్యశాస్త్రం చెబుతోంది...
అందుకే దానికి మూఢం అనే పేరు పెట్టి శుభ కార్యాలకు దూరంగా ఉండమని శాస్త్రాలు చెబుతున్నాయి...
అయితే అన్ని గ్రహాలకు ఈ పరిస్థితి వస్తున్నప్పటికీ ప్రధానంగా శుభ గ్రహాలైన గురువు, శుక్రునకు శక్తి హీనత మాత్రమే దోషంగా పరిగణిస్తుంది జ్యోతిష్య శాస్త్రం...
గురు, శుక్రులు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు అని చెబుతారు...
ఏ శుభ కార్యక్రమానికైనా గురు శుక్రులు బాగుండాలని, శక్తివంతంగా ఉంటే శుభం జరుగుతుందని విశ్వసిస్తారు...

మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం జరుగుతుందని, కష్టం కలుగుతుందని, నష్టం వాటిల్లుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు...

శుక్రమౌఢ్యమి కాలంలో ప్రకృతి సంపద క్షీణిస్తుంది, సముద్రం ఆటు, పోటులలో మార్పులు వస్తాయి...
శుక్రగ్రహ పాలిత ద్వీపాలకు, ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి, స్త్రీల మీద అత్యధికంగా అత్యాచారాలు జరిగే అవకాశాలుంటాయి...
శుక్రుడు సంసార జీవితానికి, శృంగార జీవితానికి కారకుడు జాతకంలో శుక్రుడు బల హీనంగా ఉంటే సంసారజీవితం సజావుగా సాగదు...
ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయాలని శాస్త్ర వచనం...

*మరి మూఢంలో చేయతగినవి ఏమిటి???*

💠 అన్నప్రాసన చేసుకోవచ్చు,
💠 ప్రయాణాలు చేయవచ్చు,
💠 ఇంటి మరమ్మత్తులు చేసుకోవచ్చు,
💠 భూములు కొనుగోలు, అమ్మకాలు, అగ్రిమెంట్లు చేసుకోవచ్చు,
💠 నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చు,
💠 నూతన వాహనాలు, వస్త్రాలు కొనవచ్చు,
💠 జాతకర్మ,, జాతకం రాయించుకోవడం, నవగ్రహ శాంతులు, జప, హోమాది శాంతులు, గండనక్షత్ర శాంతులు ఉత్సవాలు చేయవచ్చు...
💠 సీమంతం, నామకరణం, అన్నప్రాసనాది కార్యక్రమాలు చేయవచ్చు , గర్భిని స్త్రీలు, బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో ప్రయాణం చేయాల్సి వస్తే శుభ తిథులలో అశ్విని, దేవతి నక్షత్రాలలో శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది...

*మరి ఈ మూఢంలో చేయకూడనివి ఏమిటి??*

💠 వివాహాది శుభ కార్యాలు జరుపకూడదు,
💠 లగ్నపత్రిక రాసుకోకూడదు, వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరారు,
💠 పుట్టు వెంట్రుకలు తీయించరాదు,
💠 గృహ శంకుస్థాపనలు చేయ రాదు,
💠 ఇల్లు మారకూడదు,
💠 ఉపనయనం చేయకూడదు,
💠 యజ్ఞాలు, మంత్రానుష్టానం, విగ్రహా ప్రతిష్టలు, ప్రతాలు చేయకూడదు,
💠 నూతన వధువు ప్రవేశం, నూతన వాహనం కొనుట పనికిరాదు,
💠 బావులు, బోరింగులు, చెరువులు తవ్వించకూడదు,
💠 వేదావిధ్యా ఆరంభం, చెవులు కుట్టించుట, నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయకూడదని జ్యోిష్యశాస్త్రం చెబుతోంది ...

*_🌹శుభమస్తు🌹_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రేపటి పంచాంగం ప్రత్యేకం - దీపావళి🍁

రేపటి పంచాంగం
తేదీ - 24/10/2022
రోజు - సోమవారము
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఆశ్వీయుజ మాసం
శరదృతువు
దక్షిణాయణం
👉సూర్యోదయం - 5:59 AM
👉సూర్యోస్తమయం - 5:36 PM
👉తిథి - బ. చతుర్ధశి సా.గం. 4:47 వరకు తదుపరి అమావాస్య
👉 నక్షత్రం - హస్త మ.గం. 3:01 వరకు తదుపరి చిత్త
👉యోగం - వైధృతి మ. 3:50 వరకు తదుపరి విష్కంభం
👉కరణం - శకుని సా. 4:50
👉శుభ సమయములు - చతుర్ధశి మంచిది కాదు
👉దుర్ముహూర్తం - ప. 12:24 నుండి 1:12 వరకు పునః మ. 2:46 నుండి 3:34 వరకు
👉 రేపటి పంచాంగం ప్రత్యేకం - నరక చతుర్ధశి, స్వాతి కార్తి రా. 1:32, ఐక్యరాజ్యసమితి దినోత్సవం, దీపావళి