STUDYBIZZ - GOVT SCHEMES Updates
48.9K subscribers
992 photos
69 videos
426 files
6.73K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
ఈ నెల మొదటి వారంలో పిడుగుపాటుకు గురై మరణించిన 9 మంది కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్రేషియా విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున రూ.36 లక్షలు విడుద లకు పరిపాలనా ఆమోదం తెలుపుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి జిల్లాలో నలుగురు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరు జిల్లాలో ఒకరు పిడుగుపాటుకు మృతిచెందారు.
👍81🥰1
పట్టణాల్లో వైట్ కేటగిరీ కిందకు వచ్చే పరిశ్రమల భవనాల నిర్మాణ అనుమతుల కోసం చెల్లించాల్సిన ఫీజులో 25 శాతం రిబేటు కల్పిస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య నియంత్రణ పాటిస్తున్న కొన్ని పరిశ్రమలకు మున్సిపల్ శాఖ ఇప్పటికే రిబేటు కల్పిస్తోంది. పర్యావరణానికి మేలు చేసే గ్రీన్. కేటగిరి కింద ఉన్న పరిశ్రమలకు 25 శాతం రిబేటు అందిస్తోంది. అయితే వైట్ కేటగిరీ కిందకు వచ్చే బయోగ్యాస్ వంటి తక్కువ కాలుష్య కారక పరిశ్రమలకు కూడా గ్రీన్ కేటగిరీ తరహాలో ఫీజులో 25 శాతం రిబేటు ఇవ్వాలని కొందరు బయోప్లాంట్ పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది..
👍12
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
🔰AP Polycet Results 2025 Announced - ఏపీ పాలీసెట్ ఫలితాలు విడుదల

👉 Check results & Download rank card here👇
https://studybizz.com/results/ap-polycet-results-2025/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍12🎉1
రాష్ట్రంలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర(95523 00009)లో రేషన్ కార్డుల సేవలు అందనున్నాయి. అయితే, పెళ్లైన వారు పాత రేషన్ కార్డు నుంచి విడిపోయి కొత్తదానికి అప్లై చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. వాట్సాప్లో రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, అడ్రస్ మార్పు, కుటుంబ సభ్యుల చేర్పులు, తొలగింపులు, కార్డుల సరెండర్ వంటి సేవలు అందుతాయి.
👍25
🔵 అన్నదాత సుఖీభవ వివరాలు వెరిఫికేషన్ కు చివరి తేదీ మే 20 , 2025...

అన్నదాత సుఖీభవ పథకం అంటే ఏమిటి?.అర్హతలు , కావాల్సిన డాకుమెంట్స్ పూర్తి సమాచారం 👇🏼
https://studybizz.com/schemes/annadatha-sukhibhava-scheme/

⬜️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍16
🔔 *ఉద్యోగుల బదిలీల సమాచారం :*

➥ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీలపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

➥ మే 16వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలను చేపట్టేందుకు ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. ఇందుకు అనుగుణంగా, ఆయా ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు సంబంధించిన అర్హతలు, ప్రాధాన్యతలపై విధివిధానాలతో కూడిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

➥ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఒకే స్థానంలో ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి.

➥ అదేవిధంగా, పదోన్నతి పొందిన తర్వాత కూడా ఒకే ప్రాంతంలో ఐదేళ్లుగా కొనసాగుతున్న వారికి సైతం ఈ బదిలీలు వర్తించనున్నాయి.

➥ అయితే, ఐదేళ్ల లోపు సర్వీసు ఉన్న ఉద్యోగులు వ్యక్తిగత అభ్యర్థనల మేరకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

➥ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు లేదా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది 2026 మే 31వ తేదీలోగా పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు ఈ సాధారణ బదిలీల నుంచి మినహాయింపు లభిస్తుంది.

➥ దృష్టి లోపం కలిగిన ఉద్యోగులు కోరుకుంటే, వారి బదిలీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మానసిక వికాస సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులైన ఉద్యోగులకు, వారి విజ్ఞప్తి మేరకు బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తారు.

➥ అంతేకాకుండా, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు, వారు కోరిన పక్షంలో బదిలీల్లో ప్రాధాన్యత దక్కుతుంది.

➥ వైద్యపరమైన కారణాలతో బదిలీ కోరే ఉద్యోగుల అభ్యర్థనలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వితంతువులైన ఉద్యోగినులు వారి వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యం పొందుతారు.

➥ భార్యాభర్తలైన ఉద్యోగులు ఒకే చోట లేదా సమీప ప్రాంతాల్లో పనిచేసేలా వారి బదిలీలకు ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍335
2025GWS_36643_MS4_E.pdf
3.7 MB
Rationalization- Fixing of Positions to Specific Purpose Functionaries-Reg
👍14
ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కలిపిస్తున్నట్టు తెలిపిన సీఎం చంద్రబాబు
👍33🙏142
గ్రామ, వార్డు సచివాలయాల్లో జనరల్ పర్పస్, స్పెసిఫిక్ పర్పస్ (టెక్ని కల్) ఫంక్షనరీల విభజన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో తదుపరి చర్యగా హేతుబద్ధీకరణకు సంబం ధించి రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు కలెక్ట ర్లకు 10 నుంచి 15 రోజుల సమయం ఇవ్వనుంది.
👍112
*విద్యాహక్కు చట్టం ద్వారా అడ్మిషన్లు దరఖాస్తు ఆఖరి తేదీ నేడే!*

▪️ *ప్రైవేట్ పాఠశాలల్లో పేదలకు ఉచితంగా 25% సీట్లు.. ఒకటవ తరగతి నుంచే ఐబీ, సిబిఎస్సి, స్టేట్ సిలబస్ లో చదువుకునే అవకాశం.*

▪️ నేటితో ముగుస్తున్న ఆన్ లైన్ దరఖాస్తు గడువు.
▪️ మే 20 నుంచి 24 వరకు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తుల పరిశీలన.
▪️ మే 29న లాటరీ ద్వారా విద్యార్థుల ఎంపిక.
▪️జూన్ 8న విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న పాఠశాలకు అడ్మిషన్ల ఖరారు.
👍283
👨‍🏫 India Post GDS Result 2025 [3rd Merit List] Released - దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖ లో 21,413 GDS ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యిన వారి మూడవ జాబితా విడుదల

👉 PDF Download Link Here For All India Circles👇
🔗 https://studybizz.com/results/india-post-gds-result-2025/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍122
👩🏼‍🍼*ఏపీలో గర్భిణీ స్త్రీలకు శుభవార్త.. ఎన్టీఆర్ బేబీ కిట్లు పథకం తిరిగి పునరుద్ధరణ:*

➥ 51 కోట్ల 14 లక్షల 77 వేలు నిధులు విడుదల. ఒక్కో కిట్ కు 1410/- ఖర్చు పెట్టనున్న ప్రభుత్వం.

➥ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ బేబీ కిట్ పేరుతో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవం అయిన తల్లులకు కిట్లు అందించనున్నారు. 2016లో ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం ప్రారంభించారు. అయితే 2019 తరువాత బేబీ కిట్ పథకం ఆగిపోయింది.

✧ బేబీ కిట్ పథకంలో ఏమేమి ఉంటాయి ✧

➥ బేబీ కిట్‌లో దోమతెర, దుప్పటి, స్లీపింగ్ బెట్, యాంటీసెప్టిక్ లోషన్‌తో పాటుగా నాప్‌కిన్, డైపర్లు, షాంపూ వంటి 11 రకాల సామాగ్రి ఉంటుంది.

➥ ఈ కిట్‌లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఉచితంగా అందజేస్తారు.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍311🥰1
*RICE CARD UPDATE* : రైస్ కార్డు యాడ్డింగ్ కి పెళ్లి ఐన వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ మరియు ఫోటో రెండు కూడా అవసరం లేదు. నిన్నటి వరకు ఫోటో మరియు సర్టిఫికెట్ రెండు తప్పనిసరి. నేటి నుంచి మార్పులు వచ్చాయి గమనించగలరు
👍31
🏠 మీ మొబైల్ లోనే 3 నిముషాల్లో QR Scan / Phone Pay / GPay / ATM Card ద్వారా ఇంటి పన్ను కట్టుకోండి. పూర్తి ప్రాసెస్ 👇🏼👇🏼👇🏼

https://studybizz.com/schemes/how-to-pay-ap-house-tax-in-swarna-panchayat-site/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍141
*Important Update:*
The following survey pendency needs to be cleared immediately
1. Geo Coordinates pendency - Both pending and Migrated within AP
2. Children without Aadhar 0 to 6 pending verification
3. Death Marked Audit - Pendency
4. EKYC and
5. Aadhaar seeding for Vehicle Data.
Please inform all the secretariat staff to close above
👍101
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯7.8 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕7.8 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Implemented international yoga day module

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍8
గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నును పూర్తిగా ఆధార్ అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్ల యజమానుల ఆధార్ నంబర్ లు సేకరించి, వాటిని వారి ఇళ్ల పన్ను వివరాలతో కలిపి నమోదు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి కమిషనర్ కార్యాలయ అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ఇం టి పన్నుల వసూళ్ల ప్రక్రియను డిజిటలైజేషన్ చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ గతేడాది 'స్వర్ణ పంచాయత్స్' పేరుతో వెబ్పోర్టల్ను రూపొందించింది. ఇంటి యజమానులు, పన్నుల వివరాలను ఆ వెబ్సైట్లో నమోదు చేయించారు. ఇప్పుడు ఆ వివరాలతో పాటు యజమానుల ఆధార్ నంబర్లను పం చాయతీ కార్యదర్శులు వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు.

మీ మొబైల్ లోనే 3 నిముషాల్లో QR Scan / Phone Pay / GPay / ATM Card ద్వారా ఇంటి పన్ను కట్టుకోండి. పూర్తి ప్రాసెస్ 👇🏼👇🏼👇🏼

https://studybizz.com/schemes/how-to-pay-ap-house-tax-in-swarna-panchayat-site/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍232