Manabadi
212 members
7 photos
155 links
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్య మరియు ఉద్యోగ సమాచారం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ టెలిగ్రాం చానెల్ లో జాయిన్ అవండి.
Download Telegram
to view and join the conversation
*🔥టీఎస్ లాసెట్‌ దరఖాస్తు 20 వరకు పొడిగింపు🔥*
===========================
తెలంగాణ లాసెట్‌కు *రూ.4 వేల* ఆలస్య రుసుముతో సెప్టెంబ‌రు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్‌ ఆచార్య జీబీ రెడ్డి తెలిపారు. పలువురు అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు గడువు పెంచినట్లు పేర్కొన్నారు.
*Join our Telegram channel @ https://tttttt.me/vidyaudyogam*
*🔥ఏపీ పాలిసెట్ 27న నిర్వహణ🔥*
======================
ఆంధ్ర ప్రదేశ్ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌ను *సెప్టెంబ‌రు 27న* నిర్వహించేందుకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
*For latest updates visit: https://way2results.in*
🔥 ఏపీ ఎంసెట్ హాల్ టికెట్స్ విడుదల 🔥
===================
ఆంధ్ర ప్రదేశ్ ఎంసెట్ హాల్ టికెట్స్ సెప్టెంబర్ 10న విడుదల అయ్యాయి. 17, 18, 21, 22, 23 తేదీలలో ఇంజనీరింగ్, 23, 24, 25 తేదీలలో అగ్రికల్చర్ పరిక్షలు నిర్వహించనున్నారు. ఎంట్రన్స్ పరీక్ష 2 సెషన్స్ లో ఉదయం 09:00 - 12:00 వరకు, రెండో సెషన్ మద్యహ్నం 03:00 - 06:00 వరకు జరుగును. హాల్ టికెట్స్ https://way2results.in/apeamcetht లింక్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
🔥టీఎస్-ఈసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌. 16 నుండి కౌన్సిలింగ్ ప్రారంభం🔥
=============================
తెలంగాణ ఈ సెట్‌-2020 ఫ‌లితాల‌ను మరియు కౌన్సిలింగ్ షెడ్యూల్ తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి సెప్టెంబర్ 11న విడుద‌ల చేసింది. మొదటి విడుత కౌన్సిలింగ్ ప్రక్రియ 16 నుండి 23 వరకు ద్రువపత్రాల పరిశీలన తో ప్రారంభం, 28 సెప్టెంబర్ న సీట్ల కేటాయింపు. రెండో విడుత అక్టోబర్ 6 న ప్రారంభం అయి 9 న సీట్ల కేటాయింపు తో ముగియనుంది.
ఫలితాలు మరియు కౌన్సిలింగ్ పూర్తి తేదీలు https://way2results.in/tsecet లింక్ లో గలవు.
*🔥ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో సీట్ల భర్తీకి షెడ్యూల్🔥*
==========================
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల విద్యాసంసల్లో బీఈ/బీటెక్‌ సీట్ల భర్తీకి అక్టోబరు 6 నుంచి నవంబరు 7వ తేదీతో ఆరు విడతల సీట్ల కేటాయింపు తో ముగుస్తుంది.
* అక్టోబరు 6: రిజిస్ట్రేషన్‌/ఛాయిస్‌ ఫిల్లింగ్‌ ప్రారంభం
* 12వ తేదీ: మొదటి నమూనా సీట్ల కేటాయింపు
* 14వ తేదీ: రెండోసారి నమూనా సీట్ల కేటాయింపు
* 16వ తేదీ: మొదటి విడత సీట్ల కేటాయింపు
* అక్టోబరు 21: 2వ విడత,
* 26వ తేదీ: 3వ విడత,
* 30వ తేదీ: 4వ విడత,
* నవంబరు 3వ తేదీ: 5వ విడత,
* నవంబరు 7వ తేదీ: 6వ విడత సీట్ల కేటాయింపు
*Updates at: way2results.in*
*🔥OU పరిధిలో పలు పరీక్షలు వాయిదా🔥*
====================
ఉస్మానియా యూనివర్సిటీ పరిధి లో *ఈ నెల 15, 16న* జరగాల్సిన BE, BCA, B.Pharm, BHMCT, BCTCA పరీక్షలను కొన్ని అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు, త్వరలో కొత్త తేదీలు ప్రకటిస్తాం అని OU తెలిపింది. ఇవి తప్ప మిగతా పరిక్షలు యధావిధిగా 17 సెప్టెంబర్ నుండి నిర్వహించబడును.
*Updates at: way2results.in*
🔥అంగన్ వాడి లో 232 ఉద్యోగాలు🔥
=====================
తెలంగాణ రంగా రెడ్డి జిల్లాలో అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 41 టీచర్లు, 17 మినీ టీచర్లు, 174 ఆయాలు ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వార 18 సెప్టెంబర్ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
కావలసిన అర్హతలు
కేవలం మహిళలు మాత్రమే అర్హులు
10 వ తరగతి ఉత్తీర్ణత.
21-35 సంవత్సరాలు
తప్పనిసరిగా పెళ్లి అయిన వారు అయి ఉండాలి
తప్పనిసరిగా స్థానికంగా ఆ గ్రామా పంచాయతి లో నివసిస్తూ ఉండాలి.
పూర్తి వివరాలకు: https://way2results.in/anganwadi
*🔥అక్టోబరు 4న టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌🔥*
==================
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 35 గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి *టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ను అక్టోబరు 4న* నిర్వహించనున్నట్లు సంస్థ కార్యదర్శి వెంకటేశ్వర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. *సెప్టెంబ‌రు 24వ* తేదీ నుంచి వెబ్‌సైట్‌ ద్వారా *హాల్‌టికెట్లను* డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.
*Visit https://way2results.in for more educational news*
🔥బాసర ట్రిపుల్‌ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల🔥
========================
నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో సాంకేతిక విద్యలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులో 1,492 సీట్ల భర్తీకి ఈ నెల 16 నుంచి అక్టోబర్ 3 వరకు టెన్త్‌ పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారి జాబితాను అక్టోబర్‌ 20న విడుదల చేస్తామని విద్యాలయ ఏవో రాజేశ్వర్‌రావు.
ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు వచ్చినా.. గ్రేడ్‌లను ప్రకటించకపోవటంతో ఆ రాష్ట్ర విద్యార్థులు పోటీపడే 15 శాతం సీట్ల భర్తీకి సంబంధించి సందిగ్ధత నెలకొంది. అక్టోబరు 20వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రేడ్‌లను ప్రకటిస్తే విద్యార్థులను ఎంపిక చేస్తామని విద్యాలయం ప్రకటించింది.
పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు కొరకు https://way2results.in/iiitbasara లింక్ చుడండి.
28 నుంచి ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాలు.
====================
ఆంధ్ర ప్రదేశ్ లో సెప్టెంబర్ 28 నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు తొలిసారిగా ఆన్లైన్ ద్వార ప్రారంభం కానున్నాయి. ఫీజు ప్రథమ సంవత్సరానికి రూ.3,119, ద్వితీయ సంవత్సరంకు రూ.3,432. దరఖాస్తులకు సుమారు 10 రోజులపాటు అవకాశం కల్పించనున్నారు.
మరిన్ని విద్య ఉద్యోగం సమాచారం @ https://way2results.in/
🔥TS POLYCET సీట్ల కేటాయింపు🔥.
=================
తెలంగాణా లో పాలిసెట్‌ కౌన్సెలింగ్‌లో 22,064 మందికి సెప్టెంబ‌రు 22 రాత్రి కేటాయించారు. ఇంకా 8,948 మిగిలిపోయాయి. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబ‌రు 26వ తేదీలోపు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌రిపోర్ట్‌ చేసి ట్యూషన్‌ ఫీజు చెల్లించాలి. అక్టోబరు 5 నుంచి 6వ తేదీ మధ్య కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలి. 7వ తేదీ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. 14వ తేదీ వరకు ఓరియంటేషన్‌ కార్యక్రమం, 15వ తేదీ నుంచి తరగతులు మొదలవుతాయని ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు.
More Details @ https://way2results.in/tspolycet
🔥ఎంసెట్‌ ఫలితాలు విడుదల. 9 నుంచి కౌన్సెలింగ్‌🔥
==============================
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎంసెట్‌-2020 పరీక్షా ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఎంసెట్ ఇంజినీరింగ్‌లో 75.29 శాతం ఉత్తీర్ణత సాధించగా, 89,734 మంది ఉత్తీర్ణులయ్యారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియ అక్టోబ‌రు 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
📌 మొదటి విడత కౌన్సెలింగ్‌ కాలపట్టిక
9-17వ తేదీ వరకు: ఆన్‌లైన్‌లో సమాచారం పూర్తి చేయడం, ధ్రువపత్రాల పరిశీలనకు తేదీ, సమయాన్ని అభ్యర్థులు ఎంచుకోవాలి.
12-18వ తేదీ వరకు: ధ్రువపత్రాల పరిశీలన
12-20వ తేదీ వరకు: వెబ్‌ ఆప్షన్లు
22వ తేదీ: సీట్ల కేటాయింపు
22-27వ తేదీ వరకు: ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌
📌 రెండో విడత కౌన్సెలింగ్‌ కాలపట్టిక
29వ తేదీ: తొలి విడతలో హాజరుకాని వారు ధ్రువపత్రాల బుకింగ్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి.
30వ తేదీ: ధ్రువపత్రాల పరిశీలన
నవంబరు 2న: సీట్ల కేటాయింపు
2-5వ తేదీ వరకు: ట్యూషన్‌ ఫీజు చెల్లించడం, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయడం.
Check TS EAMCET Results 2020 at: https://way2results.in/tseamcet
*🔥ఓయూ పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు 19 నుంచి🔥*
=============================
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని *పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలను అక్టోబ‌రు 19 నుంచి 23 వరకు* నిర్వహించనున్నారు. పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు కుదించారు. జిల్లా కేంద్రాల్లో పరీక్షలు రాసే విద్యార్థులు ఓయూ వెబ్‌సైట్‌లో తమకు అందుబాటులోని కేంద్రాన్ని ఎంచుకునే అవకాశం కల్పించారు. దాని కోసం *అక్టోబ‌రు 12* లోపు ఓయూ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ శ్రీరామ్‌వెంకటేష్‌ తెలిపారు. ఆరోగ్య సమస్యలతో ప్రస్తుతం మొత్తం పరీక్షలు రాయలేని వారికి మరో అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
For latest updates visit https://way2results.in
🔥ఏపీ పాలిసెట్ పలితాలు విడుదల🔥
=====================
ఆంధ్ర ప్రదేశ్ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలీసెట్‌ ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 71,631 మంది పరీక్షకు హాజరు కాగా వీరిలో 60,780మంది (84.85శాతం) అర్హత సాధించారు. బాలురు 83.45శాతం మంది .. బాలికలు 88.25శాతం మంది అర్హత సాధించారు. బాలురు 50,706 మంది పరీక్షకు హాజరుకాగా 42,313 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 20,925 మంది పరీక్ష రాయగా.. 18,467 మంది అర్హత పొందారు.
కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌..
ధ్రువపత్రాలు, ఆన్‌లైన్‌ రుసుము చెల్లింపు: అక్టోబరు 12 నుంచి 16 వరకు
సహాయ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన: 14 నుంచి 17
కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాలు: 12 నుంచి 18
సీట్ల కేటాయింపు: 20న
కళాశాలల్లో ప్రవేశం: 21 నుంచి 27 వరకు
తరగతుల ప్రారంభం: నవంబరు మొదటి వారం
For latest updates visit https://way2results.in
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంసెట్‌లో ఇంజనీరింగ్ పరీక్షకు 1,56,953 మంది హాజరు అవగా.. 1,33,066 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి తెలిపారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 75,858 మంది హాజరు అవగా.. 69,616 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో 84.78 శాతం, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో 91.77 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
🔥ఎంసెట్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ వాయిదా.🔥
============================
అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కావాల్సిన తెలంగాణ ఎంసెట్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. ముందుగా ప్రకటించిన టైం టేబుల్ ప్రకారం ఈనెల 9 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, స్లాట్‌ బుకింగ్‌ మొదలైంది. ఈ నెల 12 నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఇంజనీరింగ్ విభాగంలో నూతనంగా ప్రవేశపెట్టిన కోర్సులకు ప్రభుత్వం నుంచి ఇంకా పర్మిషన్ రాకపోవడంతో పాటు కళాశాలలకు అఫిలియేషన్ జారీ ప్రక్రియ పూర్తి కాకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే ఈ నెల 18 నుంచి 22వరకు విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చేలా అవకాశం షెడ్యూల్ లో మార్పులు చేశారు. అనంతరం ఈనెల 24న ఆ అభ్యర్థులకు సీట్లు కేటాయింపు చేస్తారు. అనంతరం సీట్లు సాధించిన విద్యార్థులు ఈ నెల 24 నుంచి 28 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్ చేసి.. ట్యూషన్‌ ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
For latest updates visit https://way2results.in
🔥తెలంగాణ గురుకులం లో ఉద్యోగాలు.🔥
=====================
తెలంగాణా గురుకులం మహిళా డిగ్రీ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతి లో లెక్చరర్ ల నియామకానికి TSWREIS నోటిఫికేషన్ విడుదల చేసింది. 55% తో పీజీ పూర్తి చేసి ఆసక్తి గల అభ్యర్ధులు 18 అక్టోబర్ లోపు 500/- ఫీజు కట్టి దరఖాస్తు చేసుకోవాలి. జీతం ఎక్స్పీరియన్స్ ని బట్టి ₹ 25,000/- లేదా ₹ 30,000/- నెలకు. పరీక్ష తేది 31 అక్టోబర్, 2020. మరిన్ని వివరాలకు https://way2results.in/tsgurukulam లింక్ చుడండి.
TSRJC CET ఫలితాలు విడుదల
=========================
తెలంగాణ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీ (TSRJC) లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశ పరిక్ష ఫలితాలు 13 అక్టోబర్ న విడుదల అయ్యాయి. విద్యార్ధులు హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ తో https://way2results.in/tsrjc లింక్ నుండి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
For latest updates visit https://way2results.in.
🔥పదో తరగతి విద్యార్థులకు NTSE స్కాలర్షిప్ ఏక్షమ్🔥
======================
టెన్త్‌ విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించేందుకు నిర్వహించే నేషనల్‌ టాలెంట్‌ సెర్చి ఎగ్జామినేషన్‌ (NTSE) నోటిఫికేషన్ NCERT విడుదల చేసింది. ఆసక్తి గల విద్యార్థులు 200/- ఫీజు తో నవంబర్ 06 లోపు ధరఖాస్తు చేసుకోవాలి. ఎన్‌టీఎస్ఈ రెండు దశల్లో జరుగుతుంది. మొదటిది రాష్ట్రస్థాయి స్టేజ్-1, రెండోది స్టేజ్-2 జాతీయ స్థాయిలో ఉంటుంది. తొలి దశ పరీక్ష డిసెంబర్ 13 న నిర్వహించబడును. రెండో దశ లో ప్రతిభ కనబరిచి ఎంపిక చేసిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ నుంచి పీహెచ్‌డీ వరకు ఉపకారవేతనాలను (స్కాలర్షిప్‌లు) ఇస్తారు.
తెలంగాణ నోటిఫికేషన్ కోసం https://way2results.in/tsntse
ఆంధ్ర ప్రదేశ్ నోటిఫికేషన్ కోసం https://way2results.in/apntse
ఎన్టీఎస్ఈ పరీక్ష పేద, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు వరంలాంటిది. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి.
అక్టోబర్‌ 28న ఎడ్‌సెట్‌, నవంబరు 2న ఐసెట్‌, 6న లాసెట్‌ ఫలితాలు విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. విద్యార్థులు కౌన్సెలింగ్‌కు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
Latest updates @ https://way2results.in
ఎడ్‌సెట్‌ ఫలితాల విడుదల
===================
తెలంగాణ బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాలు అక్టోబ‌రు 28న ఉదయం 11.30 గంటలకు ఓయూ ప్రాంగణంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి గారు విడుదల చేశారు. మొత్తం 30,600 మంది ఈ పరీక్ష రాశారు. విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ తో రాంక్ కార్డు http://way2results.in/tsedcet లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకోవచ్చు.